తెలంగాణలో భారీ పెట్టుబడి.. రూ.450 కోట్ల పెట్టుబడితో
తెలంగాణ రాష్ట్రంలో జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ Daifuku భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని చందనపెల్లిలో డైపుకు ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 450 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో Daifuku ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఆటోమేటెడ్ స్టోరెజ్ సిస్టమ్స్, కన్వేయర్లు సహా ఆటోమేటిక్ స్టార్టర్స్ వంటి పరకరాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ పెంచి అత్యాధునిక పరిశ్రమలను స్థాపించనుంది. మొదటి దశ విస్తరణ కోసం రూ.200 కోట్ల ప్రణాళికాబద్దమైన పెట్టుబడికి ప్రణాళికలు రూపొందించింది. రాబోయే 18 నెలల్లో నూతన పరిశ్రమను ప్రారంభించాలనే యోచనలో ఉంది. సుమారు 800 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది.






