ఒంటారియో ప్రావిన్స్, తెలంగాణ ప్రభుత్వం మద్య ఒప్పందం
తెలంగాణ, కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ మధ్య ఆర్థిక సహకార విస్తృతిపై అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఢిల్లీలో జరిగిన ఐసీబీసీ వార్షికోత్సవంలో ఒంటారియో ఆర్థికాభివృద్ధి , వాణిజ్య శాఖ మంత్రి విక్ ఫెడెలీ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంవోయూపై సంతకాలు చేశారు. రెండు ప్రాంతాల మధ్య ఈవీలు, ఏరోస్పేస్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి కొత్త సహకార రంగాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది. టొరంటోలో కొలిషన్ 2023, హైదరాబాద్లో ఇండియా జాయ్ 2023 వంటి ప్రతిష్ఠాత్మక సదస్సులో పరస్పర భాగస్వామ్య ప్రోత్సాహానికి ఇరు పక్షాలు అంగీకారం తెలిపాయి.






