తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ స్పా ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ, ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని అని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని తెలిపారు. కేంద్రం సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని. దేశంలోని నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం అని ప్రశ్శించారు.
తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌కి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలన్నారు. ఏడున్నరేళ్లుగా కేంద్రం నుంచి సహాయ, సహకారాలు లేవు. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్టైల్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదన్నారు. ప్రధాని మోదీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు. రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకపోతే అది ఎలా సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో రూ.15 వందల కోట్ల పెట్టుబడులతో డ్రిల్‌మెక్‌స్పా ముందుకొచ్చింది. ఈ పరిశ్రమల ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతుందన్న కేటీఆర్ 80 శాతం వరకు స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్మెక్స్ స్పా సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.






