Parliament : పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా (Urea) సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వారితోపాటు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా దక్కల్సిన యూరియాను సరఫరా చేయకుండా తెలంగాణ (Telangana) రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు. యూరియాను బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలకు దారి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.