దావోస్‌లో సీఎం రేవంత్

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది.
ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ప్రచారాన్ని మొదలు పెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఐటీ, జీవవైవిధ్య రంగంలో తెలంగాణ ప్రాధాన్యత, అనుకూలతలను ప్రముఖులతో చర్చించామని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశం జరిగిందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తలు కలసికట్టుగా పనిచేస్తే ప్రజలు సంపన్నులుగా మారతారని రేవంత్ అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానంపై ఇథియోపియా ఉప ప్రధానితో చర్చ జరిగిందని, రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై నాస్కామ్ ప్రతినిధులతో చర్చలు జరిగాయని సీఎం రేవంత్ వివరించారు.
సమగ్ర అభివృద్ధితో సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగం అయ్యేందుకు ఎన్నారైలు ఉత్సాహం చూపిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు.
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సహ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి ఉన్నారు. జ్యురిచ్‌లో సీఎం రేవంత్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల కీలకనేతతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. కాగా, మరో 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రఖ్యాత కంపెనీలు అయిన నొవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజెంకా, గూగుల్, ఉబర్ తోపాటు బేయర్, %ూణజ%, యూపీఎల్ కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నట్లు తెలిపారు.