Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభకు పరిచయం చేశారు. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉండేవారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారని, ఎన్టీఆర్ (NTR) కు విశ్వాసపాత్రుడిగా గోపీనాథ్‌కు సత్సంబంధాలు ఉండేవన్నారు. విద్యార్థి నేతగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా రాణించారని చెప్పారు. గోపీనాథ్ తనకు మంచి మిత్రుడని, సన్నిహితుడని గుర్తు చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్ (Ratnakar) , రంగారెడ్డి (Ranga Reddy) మృతిపట్ల మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడ్డాయి.







