Talasani : 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి : తలసాని

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలకు కాంగ్రెస్ మభ్య పెడుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరికి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఆడుతున్న నాటకాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration)లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఎలా చేస్తారని అప్పుడు అడిగితే మా వ్యూహం మాకు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెపమంతా బీజేపీ(BJP), బీఆర్‌ఎస్ పై నెట్టేస్తోంది. 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? బీఆర్‌ఎస్ (BJP) తరపున కూడా రాష్ట్రపతిని కలిసి 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరతాం. అధికార యంత్రాంగంలోనూ కీలకమైన స్థానాలకు ఓ అగ్రవర్ణం వారికే ఇచ్చారు. కార్పొరేషన్ పదవుల్లో సగం బీసీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.