Suchirindia Foundation: సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం

విద్యార్థుల్లోని టాలెంట్ ని వెలికితీసేందుకు ఈ టాలెంట్ పరీక్ష సుచిర్ఇండియా ఫౌండేషన్ అధినేత… లయన్ కిరణ్ (Lion Dr.Y. Kiron)
ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ (Suchirindia Foundation) 32వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుండి 100000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 32వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో కొంత మందికి గోల్డ్ మెడల్స్, మరి కొంతమంది కి నేషనల్ ర్యాంక్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయని. ఈ యువ టాలెంట్ విద్యార్థులకు పబ్లిక్ గార్డెన్స్, లలిత కళా తోరణం లో అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు ఈ పురస్కారాన్ని సాధించిన ఈ యువ ప్రతిభ వెనుక ఉన్న ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీనటుడు రావు రమేష్ మరియు సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా విద్యార్థులు కు బహుమతులు ప్రధానం చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహాయం చేసే గొప్ప ఈ గుణ్ణం అందరకీ ఉండాలి అన్ని అన్నారు.