Kishan Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్‌పైనే : కిషన్ రెడ్డి

తెలంగాణలో బీఆర్‌ఎస్ (BRS)కంటే ఎక్కువ వ్యతిరేకత కాంగ్రెస్‌పైనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. నల్గొండ (Nalgonda)లో పార్టీ జిల్లా కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ (Job calendar) పేరుతో ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయలేదు. ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసే స్థోమత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పలు వర్సిటీలు అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పి విస్మరించారు అని మండిపడ్డారు.