హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది గ్రూప్-20 దేశాల (జీ-20)కు భారత్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించే స్టార్టప్-20 తొలి సన్నాహక సమావేశం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ప్రారంభం కానుంది. దీనికి కొనసాగింపుగా మరో సమావేశం జూలై 3న గురుగ్రామ్‌లో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో జీ-20 భాగస్వామ్య దేశాల ప్రతినిదులతో పాటు మరో 9 ప్రత్యేక ఆహ్వాన దేశాల ప్రతినిధులు కూడా పాల్గొనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతున్న స్టార్టప్‌లలో 90 శాతానికి పైగా విఫలమవుతున్నాయి. భారత్‌లో ఇది 95 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడం, విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ రెండు రోజుల సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.






