అంగరంగ వైభవంగా యాదగరీశుడి కల్యాణ మహోత్సవం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 10:59 గంటలకు మాంగళ్యధారణ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు. జయజయనారసింహ జయనారసింహ నమో నారసింహ అంటూ భక్తులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించి భక్తిపారవశ్యం లో మునిగితేలారు. స్వామివారు కల్యాణోత్సంలో మంత్రులు తమ్ముల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈఓ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.