శంషాబాద్ చేరుకున్న ప్రత్యేక విమానం
లాక్ డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు వందే భారత్ ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ నగరాలకు ఇప్పటికే పలు విమానాలు చేరుకున్నాయి. అబుదాబి నుంచి 118 మంది ప్రయాణీకులతో బయలుదేరిన రెండో విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణీకులకు ఎయిర్ పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత ప్రత్యేక బస్సులో స్టార్ హోటళ్లలోని క్వారంటైన్‌కు తరలించారు. సోమవారం రాత్రికి అబుదాబి నుంచి మరో ప్రత్యేక విమానం, సింగపూర్ నుంచి ఒక విమానం హైదరాబాద్‌కు చేరుకోనున్నాయి.






