KIMS-Sunshine Hospital: కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్

హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ (KIMS-Sunshine Hospital) గుర్తింపు తెచ్చుకుంది. రోగులకు సేవలందిస్తు, వారి సంరక్షణకు అహర్నిశలు కృషి చేస్తూ మంచి పేరును సంపాదించుకుంది. ఈ హాస్పిటల్‌కు ప్రముఖ ఆర్ఠోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి మేనెజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వైద్య చికిత్సల్లో అధునాతన పద్ధతులను ప్రవేశపెట్టడంతో పాటు, విజయవంతంగా ఎన్నో శస్త్ర చికిత్సలు నిర్వహించి మంచి పేరును గడిరచిన ఈ ఆసుపత్రిలో 30కి పైగా స్పెషాలిటీ చికిత్సలు లభిస్తాయి. ఆర్థోపెడిక్ వైద్యచికిత్సకు మారుపేరుగా ఈ ఆసుపత్రి నిలిచింది. కీళ్ల సమస్యలు, ఎముకల బలహీనత, గాయాలు, పగుళ్లు, వెన్నెముక సమస్యలు ఇతర ఎముకలకు సంబంధించిన ఇబ్బందులను తొలగించి రోగికి స్వస్థత చేకూర్చడంలో తనకు సాటిలేదని నిరూపించుకుంది.
అత్యాధునికమైన రోబోటిక్ మోకాలి మార్పిడి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్, హిప్ రీప్లేస్‌మెంట్, వెన్నెముక సర్జరీలు, చేతి మరియు అవయవ శస్త్రచికిత్సలు, ఇలిజారోవ్ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు మరియు స్పోర్ట్స్ మెడికల్ ట్రీట్‌మెంట్‌ల వంటి అత్యంత సంక్లిష్టమైన సర్జరీలను కూడా ఎక్కువ అనుభవం మరియు నైపుణ్యం కలిగిన అత్యుత్తమ ఆర్థోపెడిక్ సర్జన్లు, డాక్టర్ల బృందం చేస్తుంటుంది. రోబోటిక్ శస్త్రచికిత్సల కోసం మాకో స్ట్రైకర్ రోబోట్ మరియు మరిన్నింటితో సహా అత్యాధునిక సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అంకితమైన నర్సింగ్ సిబ్బంది మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణుల బృందం రోగులసేవలో ఎల్లప్పుడూ కనిపిస్తుంటుంది. జాయింట్ రీ-ప్లేస్‌మెంట్ సర్జరీ విభాగం ఆసియాలో రెండవ అతిపెద్ద జాయింట్ రీ-ప్లేస్‌మెంట్ సెంటర్ గా గుర్తింపు పొందింది.
ప్రతిరోజూ వందలాది మంది రోగులకు సేవలందిస్తోంది. 20 కంటే ఎక్కువ మంది వైద్యుల బృందం ప్రతిరోజూ 20 కీళ్ల మార్పిడి (మోకాలు మరియు తుంటి), రోబోటిక్ సర్జరీలు చేస్తుంది, ఇందులో ప్రాథమిక మరియు మొత్తం మోకాలి మార్పిడి మరియు తుంటి కీళ్ల మార్పిడి కూడా ఉంటాయి. ఆర్థోపెడిక్ సర్జన్లు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సాధారణ కేసులకే కాకుండా, రివిజన్ టోటల్ హిప్ ఆర్థ్రోప్లాస్టీలు, ఎసిటాబ్యులర్ ఫ్రాక్చర్ తర్వాత హిప్ యొక్క పోస్ట్-ట్రామాటిక్ ఆర్థరైటిస్ వంటి సంక్లిష్ట కేసులకు కూడా టోటల్ హిప్ రీ-ప్లేస్‌మెంట్ ఆర్థ్రోప్లాస్టీలను నిర్వహించడంలో అధిక శిక్షణ పొందినవారు మరియు అనుభవం కలిగి ఉన్నారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోబోయే రోగులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి 24 గంటలూ అందుబాటులో ఉండే సపోర్ట్ స్టాఫ్ బృందం కూడా ఇక్కడ ఉంది. అలాగే చికిత్స పూర్తయినవారికోసం వారి ఇళ్లలో ఫిజియోథేరపి సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ భారతదేశంలోనే అతిపెద్ద ‘‘రోబోట్-సహాయక కీళ్ల మార్పిడి’’ కేంద్రం ఇక్కడనే ఉంది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు మాకో రోబోను ఉపయోగించడానికి అనుమతి ఉన్న ఆస్పత్రి ఇదే. రోగి సంరక్షణలో నాణ్యత, భద్రత మరియు నిరంతర మెరుగుదలకు దాని నిబద్ధతను గుర్తించే ప్రతిష్టాత్మక ఎన్‌ఎబిహెచ్ గుర్తింపును ఆసుపత్రి పొందింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టి అందరి మన్ననలను అందుకుంది. కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి ఇప్పుడు ఆగ్నేయాసియాలో రెండవ అతిపెద్ద జాయింట్ రీప్లేస్‌మెంట్ సెంటర్‌గా మారింది, కెనడా, అమెరికా శ్రీలంక, బంగ్లాదేశ్, ఇరాన్ మరియు ఆఫ్రికన్ దేశాల నుండి రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
డాక్టర్ గురవారెడ్డి
డాక్టర్ ఎ.వి. గురవ రెడ్డి కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్‌గా వ్యవహరిస్తు న్నారు. ఆయన దార్శనిక నాయకత్వం మరియు ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయన చూపే విధానం ఆయనను ఎంతో ఉన్నత స్థానానికి తీసుకు వచ్చింది. ఏటా 4,000 కంటే ఎక్కువ కీళ్ల మార్పిడి (తుంటి, మోకాలు మరియు భుజాలు, ప్రాథమిక మరియు పునర్విమర్శ రెండూ)తో, ఆయన దక్షిణాసియాలోని అగ్రశ్రేణి కీళ్ల మార్పిడి సర్జన్లలో ఒకరిగా పేరుగాంచారు. పదేళ్లకు పైగా వివిధ దేశాల్లో ఎంతోమంది రోగుల చికిత్సలో ఆయన పాల్గొంటున్నారు. ప్రముఖ విజిటింగ్ కన్సల్టెంట్‌గా కూడా ఉంటూ తరచుగా మధ్యప్రాచ్యం, యూరప్, అమెరికాలోని ఆసుపత్రుల్లో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేయడానికి ప్రయాణిస్తూ ఉంటారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో ఆయన నైపుణ్యం ఆయనకు బలమైన ఖ్యాతిని సంపాదించిపెట్టింది. ఈ రంగంలో అంతర్జాతీయ వైద్య నిపుణుడిగా ఆయనను బాగా గౌరవిస్తారు.
డాక్టర్ రెడ్డి యుకెలోని ఎడిన్‌బర్గ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో చురుకైన ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్నారు. వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొని వైద్యరంగంలో వస్తున్న మార్పులపై ప్రసంగించి ఎందరినో ఆకట్టుకున్నారు. ఆయన ఇండియన్ సొసైటీ ఆఫ్ హిప్ అండ్ నీ సర్జన్స్ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ఆర్థోపెడిక్స్ రంగంలో డాక్టర్ రెడ్డి చేసిన అత్యుత్తమ సేవలను అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య గుర్తించి, 2010లో ఘనంగా సత్కరించారు. ఎన్నో అవార్డులను, సన్మానాలను ఆయన అందుకున్నారు. దేశ, విదేశాల్లో ఆయనకు మంచిపేరు ఉంది. ఆయన డాక్టర్‌గానే కాకుండా మంచి రచయిత కూడా. ఎన్నో పుస్తకాలను ఆయన రాశారు. గురవాయణం పేరుతో ఆయన రాసిన పుస్తకం కూడా అందరి ప్రశంసలు అందుకుంది.
డా. గురువా రెడ్డి గారి కిమ్స్ – సన్‌షైన్ హాస్పిటల్ గురించి..
నాకు డా. గురువా రెడ్డి గారితో చాలా సంవత్సరాలగా పరిచయం, కొన్ని సార్లు వారితో ఫోన్‌లో లేదా కలిసి మాట్లాడిన అనుభవం ఉంది. ూబఅంష్ట్రఱఅవ ష్ట్రశీంజూఱ్aశ్రీ సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలికి మారడం కూడా చూశాను. కానీ గత వారం నేను రెండో సారి బేగంపేటలోని కిమ్స్ – సన్‌షైన్ హాస్పిటల్ ఒక పేషెంట్‌ని కలవడానికి వెళ్ళినపుడు, ఆ హాస్పిటల్ లోపల సదుపాయాలు, వాతావరణం చూసినపుడు ఈ హాస్పిటల్ గురించి చెప్పాలనిపించింది.
డా. గురువా రెడ్డి గారు దాదాపు రిటైర్ అయ్యే సమయంలో తన ఆలోచనలు, ఆశయాలు, అనుభవాలు కలిపి కట్టుకొన్న హాస్పిటల్ అది. గ్రౌండ్ ఫ్లోర్‌లో విశాలమైన హాల్‌లో ఉన్న 8 లిఫ్ట్‌ల దగ్గర గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్‌లు వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులను మర్యాద పూర్వకంగా పలకరించి ఆ 12 ఫ్లోర్‌లలో ఎక్కడికి వెళ్ళాలో చెపుతారు.
మొదటి – రెండో ఫ్లోర్‌లలో ఓపీ (అవుట్ పేషెంట్) లుగా డాక్టర్ కన్సల్టేషన్‌లు ఉంటాయి. అక్కడ గోడలు ఒక థీమ్ ప్రకారం అందమైన ఫోటోలతో ఆకర్షణీయంగా ఉంటాయి. బాపు బొమ్మలు, రామాయణం, మెడికల్ హిస్టరీ, ప్రపంచంలో పేరొందిన ఆర్థోపెడిక్ డాక్టర్‌ల వివరాలు.. ఇలా అనేక థీమ్లతో ఆ ప్రదేశం ఒక మ్యూజియం లాగా ఉంటుంది. పైన ఉన్న ఫ్లోర్‌లలో ఆపరేషన్ థియేటర్‌లు, ముందు ఉండే వార్డ్‌లు, తర్వాత వుండే వార్డ్‌లు, పేషెంట్‌ల కోసం వచ్చే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కోసం వెయిటింగ్ రూమ్‌లు ఉంటాయి. పేషెంట్‌తో వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా ఉదయం ఫలప äరం, మధ్యాన్నం – రాత్రి సమయంలో భోజనం ఏర్పాటు చేయడం చూస్తే కొంత ఆశ్చర్యం వేస్తుంది. ఈ విషయంలో డాక్టర్ గురువా రెడ్డి మాట్లాడుతూ..PATIENT FIRST అలాగే GUEST FIRST అనేది మా ఆలోచన.. అదే మా విధానం’ అని అన్నారు. ఆధునిక మెడికల్ విధానాలతో శస్త్రచికిత్సతో పాటు పేషెంట్‌లని వారి కుటుంబ సభ్యులను ఆందోళన రహిత వాతావర ణంలో ఉంచాలనే ఆలోచన మంచిదే! దేశం నలుమూలల నుంచి వస్తున్న పేషెంట్‌లను చూస్తే ఈ ఆలోచనకు జనామోఘ్యం వచ్చిందనే చెప్పోచ్చు !
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్-తెలుగుటైమ్స్