కేటీఆర్‌కు మరోసారి అరుదైన గౌరవం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. రష్యాలోని మాస్కోలో తాము నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో ప్రసంగించాలని ఆయనకు స్కోల్‌కోవో సంస్థ ఆహ్వానం పంపింది. ప్యూచరిస్టిక్ అనే అంశంపై భవిష్యత్తు అవకాశాలు, వినియోగించుకునే విధానాలపై ప్రసంగించాలని కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపడం విశేషం. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు ఫెస్టివల్ ఆఫ్ ది ప్యూచర్ పోర్టల్ 2030-2050 లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మీరు చేసిన కృషి అద్భుతమంటూ ఆహ్వాన పత్రికలో స్కోల్కోవో ఫౌండేషన్ నిర్వాహకులు కేటీఆర్‌ను అభినందించారు.