MSVG: మనశంకర వర ప్రసాద్ గారు నుంచి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్
హైలీ యాంటిసిపేటెడ్ సంక్రాంతి ఎంటర్టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లోనూ మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ అద్భుతమైన స్టిల్స్‌లో చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా, గొప్ప చారిస్మాతో కనిపిస్తూ తన టైమ్‌లెస్ అప్పీల్, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరోసారి చాటారు. ఆయన విన్టేజ్ చార్మ్, నేచురల్ గ్రేస్ ప్రేక్షకుల మనసులని దోచుకుంది
ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు “మీసాల పిల్ల”, “శశిరేఖ” చార్ట్బస్టర్లుగా నిలిచి, భారీ వ్యూస్‌తో పాటు విశేష స్పందనను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ చివరి వారంలో విడుదల కానున్న మూడో పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి.
హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, అభిమానులు ఎంతో కాలంగా చూడాలని కోరుకుంటున్న క్లాసిక్, నాస్టాల్జిక్ అవతార్‌లో మెగాస్టార్ చిరంజీవిని ఈ చిత్రంలో ప్రజెంట్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపించనుండటం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని అందించనుంది.
భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతూ ప్రేక్షకులకు సంపూర్ణమైన పండుగ వినోదాన్ని అందించనుంది.






