హైదరాబాద్ లో ఎస్‌బిఐ ప్రాపర్టీ షో

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) కొండాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రాపర్టీ షో విజయవంతమైంది. ఈ ప్రాపర్టీ షోను ఎస్‌బిఐ (ఆర్‌అండ్‌డిబి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు శెట్టి ప్రారంభించారు. బ్యాంక్ సిజిఎం అమిత్ జింగ్రాన్, హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్లు జోగేశ్‌చంద్ర సాహు, క్రిషన్ శర్మ , ఇతర బ్యాంక్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు పి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వి రాజశేఖర్ రెడ్డి, టిబిఎఫ్ అధ్యక్షుడు సి ప్రభాకర్ రావు, ట్రెడా అధ్యక్షుడు ఆర్ చలపతి రావు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రియల్టీ రంగం అభివృద్ధికి ఎస్‌బిఐ నిరంతరం తన తోడ్పాటును అందిస్తోందని తన ప్రారంభ ప్రసంగంలో క్రిషన్ శర్మ అన్నారు. కాగా తెలంగాణ,హైదరాబాద్ సర్కిల్‌లో రియల్టీ రంగం ఎలా వృద్ధి చెందిందో వివరించిన అమిత్ జింగ్రామ్, ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ దేశంలోనే రియల్ ఎస్టేట్ రాజధాని కానుందని అన్నారు.ఈ ప్రాపర్టీ షో కేవలం కొనుగోలదారులను ఆకర్షించడానికి ఎస్‌బిఐకి ఒక వేదిక మాత్రమే కాదని, ఈ రంగంలో ప్రధాన భాగస్వాములయిన బయ్యర్లు, బిల్డర్లు, బ్యాంక్‌ను ఒక చోటికి చేర్చే వేదిక అని శ్రీనివాసులు శెట్టి అన్నారు.జోగేశ్‌చంద్ర సాహు చివర్లో వందన సమర్పణ చేశారు.