Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం

బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ సాహితీ పురస్కారాన్ని (sahitya award) ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ప్రవచన రత్నాకర డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) కు ప్రదానం చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ అబిడ్స్‌లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో దీన్ని ప్రదానం చేస్తారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి(Elluri Shiva Reddy) అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M. Venkaiah Naidu) ఈ పురస్కారాన్ని అందజేస్తారని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు. పురస్కారం కింద రూ.25వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువాతో పురస్కార గ్రహీతను సత్కరిస్తారని తెలిపారు.