ఈ నెల 15 నుంచి రైతుబంధు : మంత్రి కేటీఆర్

వానాకాలం పంటల ఖర్చు కోసం రైతుల ఖాతాల్లోకి ఈ నెల 15 నుంచి రైతుబంధు డబ్బులు జమ అవుతాయని తెలంగాణ మున్సిపల్, ఐటీ మంత్రి కే. తారక రామారావు ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రైతుల కోసం సీఎం అనేక రకాలుగా కష్టపడుతున్నారని, రెండో హరిత విప్లవానికి సీఎం కేసీఆర్ నాంది పలికారని తెలిపారు. రైతుల బంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యేలోపే భూ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని కలెక్టర్‌కు సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌పను చేపట్టామని, అటవీ అధికారులతో సమన్వయం చేసుకొని, అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.