హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ సంస్థ.. భారీగా పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్, డేటా రికవరీలో దిగ్గజ కంపెనీగా పేరొందిన రష్యాకు చెందిన ఏస్(ఏసీఈ) ల్యాబ్ హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్, మాన్యుఫ్యాక్యరింగ్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జూమ్ టెక్నాలజీస్ కంపెనీతో కలిసి ఈ హబ్‌ను నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది. సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఎస్ ల్యాబ్ సీవోవో మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీవోవో సీహెచ్. శ్రీనివాస్, ఆ సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. తాము ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలను మంత్రికి వారు వివరించారు.