RS Praveen Kumar: సిర్పూర్ నుంచే పోటీ చేస్తా: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సిర్పూర్ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పష్టం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఈ వ్యాఖ్యలు చేశారు. మన ప్రాంత సంపదను ఆంధ్రాకు తరలించిన ఆ వ్యక్తి తిరిగి పార్టీలోకి వస్తే మన ప్రాంతం నాశనమవుతుందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు కృషి చేయాలని ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పిలుపునిచ్చారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, కుట్రలను ఎదుర్కోవాలని కోరారు. త్వరలో సిర్పూర్ నుంచి గెలిచి ప్రజల ఆశయాలను నెరవేరుస్తానని ధీమా వ్యక్తం చేశారు.







