Revanth Reddy: షాకింగ్… చంద్రబాబును వెనక్కి నెట్టిన రేవంత్..!!

తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) పోటీ పడుతున్నాయి. ఈ పోటీపై రెండు రాష్ట్రాల ప్రజల్లో సర్వత్రా ఆసక్తి ఉంది. ఇప్పుడు దావోస్ (Davos) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)కు కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దీంతో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ పెట్టుబడులు రాబట్టుకొస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. చంద్రబాబు (Chandrababu) అనుభవజ్ఞుడు కావడంతో అందరూ ఆయనే ఎక్కువ పెట్టుబడులను ఆకట్టుకోగలుగుతారని అంచనా వేశారు.
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రబాబును మించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎక్కువ పెట్టుబడులను రాబట్టుకోగలిగారు. ఈ విషయంలో చంద్రబాబు వెనుకబడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సహజంగా చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డిని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్లిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయి. కానీ సీనియారిటీ విషయంలో చంద్రబాబును మించిన వాళ్లు లేరు. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. పైగా పారిశ్రామిక వేత్తలతో (Investors) చంద్రబాబుకు పరిచయాలున్నాయి. దీంతో చంద్రబాబు దూసుకుపోతారని అందరూ అనుకున్నారు.
మరోవైపు రేవంత్ రెడ్డికి అనుభవం లేదు. పారిశ్రామిక వేత్తలతో (Entreprenuers) పెద్దగా పరిచయాలు కూడా లేవు. ఇంగ్లీష్ పైన కూడా అంతగా పట్టులేదు. ఆయన దావోస్ పర్యటనను చాలా మంది హేళన చేశారు. రేవంత్ రెడ్డి హడావుడి చేయడానికే దావోస్ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ రేవంత్ ఇవేవీ పట్టించుకోకుండా దావోస్ వెళ్లారు. ఆయన పర్యటనకు సంబంధించి పెద్దగా ప్రచారం కూడా చేసుకోలేదు. కానీ పారిశ్రామిక వేత్తల మనసులు గెలుచుకోగలిగారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక పెట్టుబడులను రేవంత్ రెడ్డి రాబట్టుకోగలిగారు.
దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి టీం రూ.కోటి 78లక్షలకు పైగా విలువైన పెట్టుబడులకు సంబంధించి 20 కంపెనీలతో ఒప్పందాలు (Deals) చేసుకున్నారు. వీటి ద్వారా దాదాపు 50వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.40వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి దానికి నాలుగింతల పెట్టుబడులు రావడం విశేషం. ముఖ్యంగా అమెజాన్ (Amazon)తో రూ.60వేల కోట్ల రూపాయల ఒప్పందం అతి పెద్దది. అలాగే సన్ పెట్రో కెమికల్స్ (Sun Petrochemicals) రూ.45వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఒప్పందం చేసుకుంది. మొత్తంగా పెట్టుబడుల విషయంలో ఈసారి చంద్రబాబును రేవంత్ రెడ్డి వెనక్కు నెట్టేశారు. దావోస్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డికి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.