Revanth Reddy: పీఏసీ సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..
ఉప రాష్ట్రపతి అభ్యర్థి గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudharshan Reddy) ని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించి నందుకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ధన్యవాదాలు.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కుల ను కాపాడటం కోసం పని చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రం లో కులగణన చేపట్టాo. బీసీ లకు విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గం లో ఆమోదించి అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు.. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం.
కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం..దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ లకు మేలు జరగాల్సిందే.. రాహుల్ గాంధీ మాట నిలబడాలి… కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీ లకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదు .. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీమ్ కోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుంది.. విడిగా సుప్రీం కోర్టు కు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుంది..
బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్ర కు ఈ నెల 26 న హాజరవుతున్న .. బీఆర్ ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరత పైన డ్రామా లు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీ కే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటిఆర్ అనడం లో నే వాళ్ల తీరు అర్థం అవుతుంది.. యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ ను కలిశాను.. యూరియా పంపిణీ పైన శేత్రస్థాయి లో మానిటరింగ్ ను పెంచాలి..







