Revanth Reddy: సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). లబ్ధిదారుడి కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీసిన సీఎం. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదన్న తులసమ్మ (Tulasamma). ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసిన కుటుంబం. 200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీసిన సీఎం. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేసిన తులసమ్మ.