Revanth Reddy: తొలివిడత అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలి : రేవంత్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇన్‌ఛార్జి మంత్రులు, ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలి. నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలి. నామినేషన్ల దరఖాస్తు నమూనా పత్రం క్షేత్రస్థాయికి పంపాలి. రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలి. వారికి బీ ఫారం ఇవ్వాలి నో డ్యూ పత్రాలు ఇప్పించాలి. గాంధీ భవన్‌లో న్యాయపరమైన అంశాల నివృత్తికి సమన్వయ కమిటీ ఉండాలి. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా చూడాలి. ఎంపీపీ (MPP) లు, జడ్పీ చైర్మన్ (ZP Chairman) పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయిస్తుంది. పీసీసీ నిర్ణయించే వరకు రాజకీయ ప్రకటనలు చేయవద్దు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసుపై పీసీసీ చీఫ్ పర్యవేక్షించాలి. ఉన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత తదుపరి కార్యచరణపై మరో భేటీ నిర్వహిస్తాం. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలి అని తెలిపారు.