ధాన్యం కొనుగోలు, నీటి సరఫరా అంశాలపై స్పందించిన రేవంత్ రెడ్డి..

ధాన్యం కొలుగోలు, నీటి సరఫరా ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమంగా నీటి కొరతను ఏర్పరిచి.. ప్రజలను ఇబ్బంది పెడితే ఒప్పుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరా అందివ్వడం కోసం బస్తీల వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని.. అటువంటి వారిపై నిఘా పెట్టాలని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటుగా ధాన్యం కొనుగోలు గురించి కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. కొనుగోలు చేసే సమయంలో తరుగు తీస్తే వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ధాన్యమును బ్లాక్ మార్కెట్లో పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలని సూచించారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేయడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేశారు.