Eli Lilly: ఐసీసీసీ లో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు

హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్ లీసంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్. జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్,సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి. హైదరాబాద్ లో 9 వేల కోట్ల తో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ,క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఎలి లిల్లీ. ఎలి లిల్లీ సంస్థను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).
తెలంగాణ పైన నమ్మకం వచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ అంటేనే బిజినెస్. హైదరాబాద్ గ్లోబల్ సిటీ.. పరిశ్రమలు పెట్టే వారికి మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నది. 1965 లో ఇందిరాగాంధీ హైదరాబాద్ కి ఐడి పి ఎల్ తీసుకు రావడం తో ఫార్మా హబ్ గా మారింది. హైదరాబాద్ లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ లు హైదరాబాద్ లోనే ఉత్పత్తి అయ్యాయి.
ఫార్మా పాలసీ ని మా ప్రభుత్వం మరింత ముందుకు తీసుకు వెళ్తుంది. జినోమ్ వ్యాలీ లో ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం. జినోమ్ వ్యాలీ కి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అందిస్తాం. ఆనంద్ మహీంద్రా నేతృత్వం లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఫార్మ్ కు సంబంధించిన అనేక మంది ప్రముఖులు స్కిల్ యూనివర్సిటీ బోర్డు మెంబర్స్ గా ఉన్నారు.