రేవంత్ చేతుల్లో హై ఎండ్ ఆయుధంగా మారుతున్న హైడ్రా.. కష్టాల్లో కారు పార్టీ..

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తరువాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దూకుడు నిర్ణయాలతో ప్రజలలో రేవంత్ రెడ్డి ఓ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు అన్నది వాస్తవం. భయపడుతూ కూర్చుంటే ఈరోజుల్లో ఏ పని జరగదు.. అందుకే రేవంత్ రెడ్డి తన చేతికి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనపై తన మార్కు ముద్రను వేయడానికి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
మంచి చేస్తూ పోతే ప్రజలలో మంచి పేరు రావడమే కాదు తమకంటూ ఓ బ్రాండ్ వాల్యూ కూడా ఏర్పడుతుంది అన్నట్లు ఉంది రేవంత్ సర్కార్ ధోరణి. ఈ తెగింపు తెలంగాణ ప్రజలలో రేవంతకు ఓ కొత్త ఇమేజ్ ను తెచ్చిపెడుతోంది. సంచలనాత్మకమైన నిర్ణయాలకు అడ్డగా రేవంత్ పాలన సాగుతోంది. ఎయిర్ పోర్ట్ మెట్రో దగ్గర నుంచి మురికి కంపు కొడుతున్న మూసీ ప్రక్షాళన వరకు రేవంత్ వినూత్నంగా ప్లాన్ చేస్తూ తన ఇమేజ్ ను క్రమంగా పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన హైడ్రా సృష్టించిన హై డ్రామా అంతా ఇంత కాదు. విపత్తు వచ్చిన సమయంలో ప్రజలకు సాయం చేయడం కోసం ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను పరిరక్షించడానికి వీలుగా హైడ్రాస్ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థకు రేవంత్ తనదైన స్టైల్ లో ఓ సరికొత్త గుర్తింపును తీసుకువచ్చారు. నిర్మోహమాటంగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు పక్క రాష్ట్రాల నుంచి కూడా మంచి ఆదరణ అందుకుంటుంది..
హైడ్రా వ్యవస్థ ఏర్పాటు వివరాలను తమతో షేర్ చేసుకోవాలి అని ఇతర రాష్ట్రాలు కోరుతున్నాయి. ఏ మాత్రం ఒత్తిళ్లకు లొంగకుండా.. కేవలం తన పని మీద ఫోకస్ పెట్టుకొని రేవంత్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అనుకోకుండా అతనికి ఓ పెద్ద హైఎండ్ ఆయుధంగా మారింది. ఇప్పటివరకు ఎన్నో సర్కార్లు వచ్చినప్పటికీ తెలంగాణ విషయంలో ఇటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు ఎవరూ తీసుకోలేదు అన్న టాక్ బలంగా నడుస్తోంది. ఇదే రీతిలో రేవంత్ దూసుకుపోతే వచ్చే ఎన్నికల్లో కూడా కారు పార్టీకి కనుచూపు మేరలో ఛాన్స్ దొరకదు అంటున్నారు విశ్లేషకులు.