తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా ఆగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌కు ఆధార్ లింక్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టు తెలిపారు. యూడీఐఏలో ఈకేవైసీ వెరిఫికేషన్‌కు సంబంధించి సాంకేతిక సమస్యగా చెబుతున్న అధికారులు దానిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డారు. సమస్య పరిష్కారమైతే వేచి ఉన్న వారి రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేస్తామని, రద్దీగా ఉన్న కార్యాలయాల్లో శుక్రవారం రావాల్సిందిగా ఇప్పటికే తెలియజేసినట్టు పేర్కొన్నారు.