Raja Singh : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు .. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డులో కవిత (Kavitha) మాట్లాడిరది నిజమేనన్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్ (BRS) తో కలిసిపోతారు. బీజేపీ అభ్యర్థులు (BJP candidates) ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే బీజేపీ నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీలతో మా నేతల కుమ్మక్కుతోనే పార్టీ నష్టపోయింది. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో ఆలోచించాలి. వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది. ఇతర పార్టీల నేతలతో మా నేతల కుమ్మక్కు అందరికీ తెలుసు అని తెలిపారు.