Raghunandan: బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? : రఘునందన్

బీజేపీ ఎదుగుదలను ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) ఆరోపించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. చిట్‌చాట్‌లు ఎందుకు? ధైర్యముంటే ప్రెస్‌మీట్‌లు పెట్టండి. తప్పుడు వార్తలు రాయిస్తున్నారని చెప్పడం ఎందుకు? బీఆర్‌ఎస్ (BRS) తో మా పార్టీ అధిష్ఠానం ఎప్పుడూ మాట్లాడలేదు. లేనిపోని పంచాయితీలు ఎందుకు? కుండ బద్దలు కొట్టినట్లు చెప్పండి. చిట్‌చాట్‌ల పేరుతో మా పార్టీని వివాదంలోకి లాగొద్దని కవితకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ సొంత పంచాయితీలు మీరే తేల్చుకోండి. మమ్మల్ని లాగొద్దు. టీఆర్‌ఎస్ ( ప్రస్తుతం బీఆర్‌ఎస్) గతంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 2004లో కాంగ్రెస్ (Congress) తో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంది. 2009లో మహా కూటమి పేరుతో పలు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 2024లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది ఎవరు? బీఆర్‌ఎస్‌తో బీజేపీ (BJP) ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? అని ప్రశ్నించారు.