ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం

బీఆర్‌్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భవన్ ఇంచార్జి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శాలువాకప్పి గౌరవప్రదంగా సన్మానించారు. అనంతరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా శ్రీనివాస్ రెడ్డి వాహనం వద్దకు కేసీఆర్ వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు.