At home: ఆహ్లాదంగా ఎట్ హోం

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం(At home) ఆహ్లాదకరంగా జరిగింది. శీతాకాల విడిడి కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ప్రముఖులకు తేనిటి విందు తో ఆతిథ్యమిచ్చారు. రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్టుదేవ్ వర్మ దంపతులు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, సీఎం సలహాదారు మేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డీజీపీ జితేందర్, ఎస్పీఎఫ్ అధిపతి అనిల్‌కుమార్ తదిదరుల హాజరై ఆతిథ్యాన్ని స్వీకరించారు.