Bandi Sanjay: అందుకే ఆయన లొంగిపోయారు : బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) పథకం మేరకే లొంగిపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ విచారణలో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్‌రావుకు కేసీఆర్ కుటుంబం (KCR family) తో అమెరికాలో కౌన్సిలింగ్ పూర్తయిందని అందుకే ఆయన లొంగిపోయారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని విమర్శించారు. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్‌రావు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేశారో ప్రజలకు తెలియాలి. ఫోన్ ల్యాప్ చేసి ఏం చేశారు? ఆడియోలు (Audios) ఎవరికి పంపారు? ట్యాపింగ్ ఆడియోలను అడ్డుపెట్టుకొని ఎవరిని బెదిరించారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. కాంగ్రెస్ వచ్చాక ఒక్క అవినీతి కసు విచారణకు ముందుకు సాగలేదు. ప్రభాకర్‌రావు, సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందే అని డిమాండ్ చేశారు.