Minister Ponnam : అధికార పార్టీకి అవకాశమిస్తే.. నియోజకవర్గం అభివృద్ధి : మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ (Congress party) జెండా ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election ) పై కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. నూతన రేషన్ కార్డులు (new ration cards), సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు (free bus) ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో 6 వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు గుర్తించారు. అధికార పార్టీకి అవకాశమిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి బూత్‌కు ఒకరు ఇన్‌ఛార్జిగా ఉండాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఎక్కడా ఉండకూడదని సూచించారు. నియోజకవర్గంలో 7 డివిజన్లలో ఇన్‌ఛార్జి ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లు ప్రభావవంతంగా పని చేయాలని తెలిపారు. డివిజన్లలో కార్యాలయాలు ప్రారంభించుకోవాలని, బూత్‌వారీగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండిరగ్‌లో ఉన్న ఇతర ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాలన్నారు.