Ponnam Prabhakar: కేటీఆర్ పోరాటంలో ఆ తర్వాతే వేగం పెరిగింది.. మంత్రి పొన్నం ఎద్దేవా!

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై (KTR) తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ తన ఉనికిని నిలుపుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్నారని, అధికారం కోల్పోయిన తర్వాతే ఆయన పోరాటంలో వేగం పెరిగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీసీని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ (BJP) నేత కిషన్ రెడ్డికి కూడా పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఒక సూచన చేశారు. “మీరు తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో ఒక బీసీ వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను” అని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, కులాలు, వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పునరుద్ఘాటించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మెజార్టీ స్థానాలు గెలిచి తీరుతుందని పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ధీమా వ్యక్తం చేశారు.