TG Govt: గవర్నర్, కేసీఆర్, కిషన్‌రెడ్డికి ఆహ్వానం

ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ (Jishnudev Sharma), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను, దిల్‌కుషా అతిథిగృహంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) ని కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాలు అందజేశారు. అనంతరం ఎర్రవల్లికి వెళ్లి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను ఆహ్వానించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉన్నారు.