Ponguleti: ఏ జిల్లాను రద్దు చేయడం లేదు: మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను రద్దు చేయదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (srinivas reddy) స్పష్టం చేశారు. శాసనమండలి (Legislative Council) లో మంత్రి మాట్లాడారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వద్దకు నిధుల కోసం తరచూ వెళ్తాయని, వెళ్లిన ప్రతిసారీ నిధులు రావని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ (BRS) హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో తెలుసని ఎద్దేవా చేశారు. ఇది పేదల ప్రభుత్వమని, పేదల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు.