Operation Kagar: ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలి :తమ్మినేని

ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో చేస్తున్న హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం కేంద్రకమిటి సభ్యుడు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటూ శాంతిచర్చల కమిటీ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. కాల్పులు విరమణ ప్రకటించి మావోయిస్టుల (Maoists) తో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని తొలగిస్తే వామపక్ష ఉగ్రవాదం ఉండదన్నారు. మావోయిస్టులను 2026 మార్చి 31 నాటికి అంతం చేస్తామని ప్రకటిస్తున్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన హామీల పరిష్కారానికి డేట్ చెప్పాలి. శాంతి చర్చల కమిటీ 17న చేపట్టే మహాధర్నాను పార్టీలకు అతీతంగా విజయవంత చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal), జస్టిస్ చంద్రకుమార్, చెరుకు సుధాకర్, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.