Mahesh Kumar Goud: ఆ రెండు పార్టీల కుట్ర.. కేంద్రం తక్షణమే ఇవ్వాలి : మహేశ్ కుమార్ గౌడ్

రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద అక్కసుతో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వట్లేదని ఆరోపించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లో ఢల్లీిలో ఉన్నారని విమర్శించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ (Bandi Sanjay) వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నాయి. కాంగ్రెస్‌ను అభాసుపాల్జేయాలని కుట్ర చేస్తున్నాయి. ఇప్పటికే యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారు. రైతులు ఆందోళన చెందవద్దు అని అన్నారు.