ఎల్ అండ్ టీ సంస్థ కీలక ప్రకటన

హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ పై ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది. పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాల కోసమే ఈ విధానం తీసుకొచ్చినట్లు వెల్లడించింది.