ప్రగతి కాలేజి విద్యార్థిని నాగలక్ష్మికి స్పిరిట్యువల్ ఫౌండేషన్ లక్ష రూపాయల ఆర్ధిక సహాయం
మెంఫిస్, టెన్నిసీ, యుఎస్ఎ. డిసెంబర్ 20, 2025: స్పిరిట్యువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్రప్రభ వాసిలి దంపతులు హైదరాబాద్ దిల్సుక్ నగర్ లోని ప్రగతి వుమెన్స్ డిగ్రీ కళాశాల విద్యారిని జి. నాగలక్ష్మికి ఉన్నత విద్య కోసం లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రముఖ పత్రికా సంపాదకులు, రచయిత, కవి, మాస్టర్ సి.వి. వి. యోగాశ్రమ వ్యవస్థాపకులు, యోగపుంగవులు, కీర్తి శేషులు శ్రీ శార్వరి మరియు శ్రీమతి యామిని దేవిల సంస్మరణార్ధం ప్రతీ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లోని పేద విద్యార్థులకి లక్ష రూపాయల విరాళం ఇవ్వ సంకల్పించారు.
ప్రస్తుతం కంప్యూటర్ అప్లికేషన్స్లొ బిసిఎ రెండవ సంవత్సరం చదువుతున్న నాగలక్ష్మి ఇటీవల మదురై కామరాజ్ యూనివర్సిటీ తెలుగు విభాగం నిర్వహించిన విశ్వర్షి వాసిలి వాజ్మయం దృక్పథాల ఆవిష్కరణ అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రాన్ని సమర్పించి బెంగుళూరు విశ్వవిద్యాలయం ఆచార్యులు జి ఎస్ మోహన్, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆచార్యులు విస్తలి శంకరరావు, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం ఆచార్యులు జొన్నలగడ్డ వెంకట రమణ, విశ్వర్షి వాసిలి మరెందరో ప్రముఖ పరిశోధకుల ప్రశంసలు పొందడంతో పాటు ఉత్తమ పత్ర సమర్పణ అవార్డును అందుకున్నారు. ఆస్ట్రేలియా, యూరోప్, కెనడా, యూఎస్ఏ వంటి దేశాలలో మాస్టర్స్ చేయగల అవకాశాలు, నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలను నాగలక్ష్మికి వివరించినట్లు శ్రీమతి చంద్రప్రభ తెలిపారు. 2026 సంవత్సరానికి గాను స్పిరిట్యువల్ ఫౌండేషన్ ప్రకటించిన ఈ మొత్తాన్ని త్వరలోనే నాగలక్ష్మికి అందజేయనున్నట్లు డాక్టర్ రమణ తెలిపారు.
విశ్వర్షి వాసిలి వాజ్మయం దృక్పథాల ఆవిష్కరణ అంతర్జాతీయ సదస్సులో ఉత్తమ పత్ర సమర్పణ అవార్డు – నాగలక్ష్మి.






