GST : జీఎస్టీతో తెలంగాణకు రూ.7వేల కోట్లు నష్టం : డిప్యూటీ సీఎం భట్టి

జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు నష్టం వస్తుందని అంచనా ఉన్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఢల్లీిలో జరిగిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ తరపున భట్టి విక్రమార్క హాజరు కాగా, తమిళనాడు (Tamil Nadu) , కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రaార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు (Finance Ministers) హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మంత్రులు డిమాండ్ చేశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలతో మొత్తం రూ.2 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తమ ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు.