Hyderabad: ఆఫీస్ స్పేస్‌కు చిరునామాగా హైదరాబాద్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఒక్కొక్కటి హైదరాబాద్‌లో అడుగు పెడుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు.. పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతున్నాయి. దీంతో దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆఫీస్ మార్కెట్లలో నగరం అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది తొలి అర్ధభాగం నగర ఆఫీస్ మార్కెట్‌లో అనూహ్యమైన డిమాండ్‌ను చవిచూసిందని ‘ఎ బిలియన్ స్క్వేర్ ఫీట్ అండ్ కౌంటింగ్ ఇండియా ఆఫీస్ సప్లై’ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగం పూర్తయ్యే నాటికి, నగరం మొత్తం ఆఫీస్ స్టాక్ 123 మిలియన్ చదరపు అడుగులు, ఇది భారతదేశపు మొత్తం ఆఫీస్ మార్కెట్‌లో 12% కాగా వార్షికంగా చూస్తే 9.2% అభివృద్ధితో టాప్ ఆరు మెట్రో నగరాల్లోనే అత్యధిక వృద్ధిని ప్రదర్శించింది. టెక్ రంగంలో బలమైన ప్రగతి, నిరంతరం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల మెరుగుదల, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణం నగర కార్యాలయ విస్తృతికి దోహదం చేస్తున్నాయని అంటున్నారు.
హైదరాబాద్‌లోని కొండాపూర్, మణికొండతో సహా సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లు(ఎస్‌బీడీలు) నగర వాణిజ్య కార్యాలయ ల్యాండ్‌స్కేప్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవే మొత్తం కార్యాలయ సముదాయంలో ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రామ్‌గూడ వంటివి ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంప్రదాయ సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. మెట్రో కనెక్టివిటీ వంటి బలమైన మౌలిక సదుపాయాలు తక్కువ కార్యాచరణ ఖర్చులు వంటివి ఈ వృద్ధికి ఆజ్యం పోస్తున్నాయి. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట హైదరాబాద్ లోని తన కార్యకలాపాల్ని భారీ ఎత్తున విస్తరించేందుకు వీలుగా ఆఫీసు స్పేస్ ను లీజుకు తీసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఫీనిక్స్ సెంటారస్ భవనంలో 2.65 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకున్న వైనం పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికకరంగా మారింది. భారత్ లోని ప్రీమియం.. ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ అడ్డాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ వాదనను బలపరిచేలా తాజా లీజు డీల్ జరిగినట్లుగా చెబుతున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో కోటి చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ డీల్ జరిగిందని.. అందులో టెక్నాలజీ దిగ్గజ కంపెనీల వాటానే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తాజా డీల్ విషయానికి వస్తే.. ఫీనిక్స్ సెంటారస్‌లోని మూడు.. నాలుగు అంతస్థుల ను ఐదేళ్ల లీజుకు మైక్రోసాఫ్ట్ తీసుకుంది. జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంలో చదరపు అడుగుకు రూ.67 చొప్పున మొత్తం స్థలానికి నెలకు రూ.1.77 కోట్ల కనీస అద్దె.. నిర్వహణ వ్యయాలు.. ఇతర ఛార్జీలు కలుపుకొని రూ.5.4 కోట్ల మొత్తాన్ని చెల్లించనుంది. ఈ అద్దె ప్రతి ఏడాది 4.8 శాతం పెరిగేలా లీజు ఒప్పందం కుదిరింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.42.15 కోట్లు జమ చేసింది. ఈ భవన యజమాని అయిన ఫీనిక్స్ టెక్ జోన్ నుంచి టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ ఈ భవనాన్ని లీజుకు తీసుంది. దాన్ని మైక్రోసాఫ్ట్ లో కొంత భాగాన్ని ఇస్తూ తాజా ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్ గిరాకీ ఎలా ఉందన్న దానికి ఈ డీల్ ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు. నగరం కొంత కాలంగా ఐటీ/ఐటీఇఎస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు), ఫార్మా లైఫ్ సైన్సెస్ సంస్థలకు ఆకర్షణీయంగా, అయస్కాంతంలా మారింది. ఇవే ప్రధానంగా లీజింగ్ కార్యకలాపాలకు ఊపునిస్తున్నాయి.
అందుబాటు ధరల ఇళ్ళపై దృష్టి పెట్టండి…
రాష్ట్రంలోను, ఇతర చోట్ల అందుబాటు ధరల ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, అలాగే 45 లక్షల రూపాయలలోపు ధర కలిగిన అఫోర్డబుల్ ఇండ్ల డిమాండ్ పెంచేందుకు, వీటి సరఫరా మెరుగు పరిచేందుకు వీలుగా స్టాంప్ డ్యూటీ తగ్గించాలని రియల్టర్స్ ఆర్గనైజేషన్ నరెడ్కో రాష్ట్ర ప్రభుత్వాలను ఓ ప్రకటనలో కోరింది. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా టాప్ 8 నగరాల్లో అందుబాటు ధరల విభాగంలో (రూ.50 లక్షల్లోపు) 94 లక్షల యూనిట్ల ఇళ్ల కొరత నెలకొంది. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ మొదటి ఆరు నెలల్లో తగ్గుముఖం పట్టిందని.. ఈ కాలంలో అందుబాటు ధరల ఇళ్ల యూనిట్ల విక్రయా లతో పోల్చితే కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ నిష్పత్తి 0.36 శాతంగా ఉన్నట్టు నరెడ్కో నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడిరచింది. 2019 మొదటి ఆరు నెలల్లో ఇది 1.05గా ఉంటే, 2020 మొదటి ఆరు నెలల్లో 1.30 గా ఉన్నట్టు తెలిపింది. ఢల్లీిలో జరిగిన ఒక కార్యక్ర మంలో భాగంగా ఈ నివేదికను నరెడ్కో, నైట్ ఫ్రాంక్ సంయుక్తంగా విడుదల చేశాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో సరఫరాపరంగా సవాళ్లు నెలకొన్నట్టు ఈ నివేదిక తెలిపింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢల్లీి ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్ గణాంకాలు ఇందులో ఉన్నాయి.
సంస్థ అధ్యక్షుడు హరిబాబు దీనిపై మాట్లాడ తూ, భూమి, నిర్మాణ ఖర్చులు పెరగడంతో రూ.45 లక్షల లోపు అపార్ట్‌మెంట్ల అమ్మకాలు, కొత్త లాంచ్‌లు తగ్గాయని చెప్పారు. అఫోర్డబుల్ ఇండ్లపై స్టాంప్ డ్యూటీని మహిళలకు 1 శాతానికి, పురుషులకు 3 శాతానికి తగ్గించాలని సూచించారు. ప్రస్తుతం ఇది 5 శాతం-10 శాతం మధ్యలో ఉంది. స్లమ్ రీడెవలప్‌మెంట్‌పై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని నరెడ్కో యాన్యువల్ కన్వెన్షన్‌లో హరిబాబు అన్నారు.
ఈ విభాగంలో 94 లక్షల యూనిట్ల కొరత ఉందంటూ.. 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు పెరుగుతుందన్నారు. ‘‘ఈ విభాగంలో కొత్త సరఫరా గణనీయంగా తగ్గింది. అదే సమయంలో డిమాండ్ పెరుగుతుండడం ఆందోళనకరం. ప్రైవేటు రంగం పెట్టుబడులు పరిమితంగానే ఉండడం ఈ అంతరాన్ని మరింత పెంచుతోంది. కనుక సరఫరాను పెంచేం దుకు సంస్కరణలు అవసరమన్నారు. ఇళ్ల నిర్మాణానికి వీలుగా ప్రభుత్వ భూములను అందుబా టులోకి తీసుకురావాలి. ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలను క్రమబద్దీకరించాలి. నిర్మాణ కోసం రుణాలను రాయితీపై అందించాలి’’ అని హరిబాబు కోరారు. డిమాండ్ పెంచేందుకు విధానపరమైన మద్దతు ప్రశంసనీయమేనని, అదే సమయంలో సరఫరా పరంగా ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ కోరారు. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల న్నారు. నరెడ్కో, నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, రూ.50 లక్షల లోపు ఇళ్ల ప్రాజెక్ట్ లాంచ్‌లు, అమ్మకాల నిష్పత్తి 2025లో 0.36కి పడిపోయింది. 2019లో ఇది 1.05 శాతంగా, 2020లో 1.30 శాతంగా నమోదైంది. బెంగళూరు, ఢల్లీి- ఎన్‌సీఆర్, ముంబై ఎంఎంఆర్, పూణె, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి 8 ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రిపోర్ట్ ప్రకారం, దేశంలో 94 లక్షల ఇండ్ల అవసరం ఉంది. ఇది 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు పెరగొచ్చు. అర్బన్ హౌసింగ్ రంగంలో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదనే విషయం దీనిని బట్టి అర్థమవుతోందన్నారు.