ఈ ఏడాది చేప ప్రసాదం లేదు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదాన్ని పంపిణీ చేయబోమని నిర్వాహకుడు బత్తిని హరినాథ్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 175 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఈ పక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది, తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 29తో ముగిసినా చేప ప్రసాదం పంపిణీ మాత్రం ఉండదని సృష్టం చేశారు. ఏటా విదేశాల నుంచి కూడా వేల మంది ఇందుకోసం హైదరాబాద్‌కు వస్తుంటారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా ఎవరూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ పేరిట ఎవరైనా చేప మందు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటిస్తే నమ్మొద్దని కోరారు.






