BC Reservations: బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : మహేశ్‌కుమార్ గౌడ్

బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయన్నారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానన్నది కేసీఆర్ కదా? అని ప్రశ్నించారు. జగన్‌తో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకొని విందులు, వినోదాలు చేసుకున్నారు. ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారు. బనకచర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదు. బనకచర్లపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లతో వివరించే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తాం. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే యోచనలో ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తాం అని స్పష్టం చేశారు.