హైదరాబాదులో న్యూ బ్యాలెన్స్ ఫుట్వేర్ స్టోర్ ప్రారంభం…

ఫుట్వేర్ రంగంలో పేరుగాంచిన న్యూ బ్యాలెన్స్ స్టోర్ ఇప్పుడు హైదరాబాదులో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలి రిటైల్ స్టోర్ ని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో బుదవారం ప్రారంభించారు. క్రీడాకారులకు, ఫ్యాషన్ ప్రియులకు కావలసిన రీతిలో లభించే ఫుట్వేర్ ను ఇక్కడ అందుబాటులో ఉంచారు. నగరవాసుల ఆలోచనలకు, అభిరుచికి అనుగుణంగా తొలిసారిగా రిటైల్ కాన్సెప్ట్ స్టోర్ ని ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ కంట్రీ మేనేజర్ రాదేశ్వేర్ దావర్ తెలిపారు. ఇక్కడికి వచ్చే వినియోగదారులు బ్రాండ్ యొక్క వినూత్న ఫ్రెష్ ఫోమ్ మరియు ఫ్యూయల్‌సెల్ టెక్నాలజీలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని పొందుతారు. ఈ సేకరణలో 1080, 550, 327 మరియు 9060 వంటి న్యూ బ్యాలెన్స్ ఐకానిక్ ఫ్రాంచైజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
వచ్చే నెలలో పూణేలో న్యూ బ్యాలెన్స్‌కి సంబంధించిన ఇదే విధమైన రిటైల్ కాన్సెప్ట్ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని మా కొత్త స్టోర్ కేవలం రిటైల్ స్థలాన్ని మాత్రమే సూచిస్తుంది. న్యూ బ్యాలెన్స్ అనుభవాన్ని మా కస్టమర్‌లకు మరింత చేరువ చేయడంలో మా నిబద్ధతకు ఇది నిదర్శనం” అని దావర్ అన్నారు.