పటాన్ చెరులో వేల్యూ జోన్

షాపింగ్ రంగంలో విప్లవాన్ని ఆవిష్కరిస్తున్న వేల్యూజోన్ హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్ చెరులో షాపింగ్ మాల్ ప్రారంభిస్తోంది. వేల్యూజోన్ బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ మాల్‌ను ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఇది సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని యాజమన్యాం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్రిశాట్, నిమ్జ్, ఐఐటీ వంటి ప్రముఖ సంస్థలు సమీపంలోనే ఉన్నందు వల్ల ఆ సంస్థల సిబ్బందికి, వారి కుటుంబాలకు ఇది చక్కని షాపింగ్ గమ్యంగా ఉంటుందని పేర్కొంది.