ఎంపీగా రఘువీర్ రెడ్డి విజయం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు

తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి రికార్డు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5.52 లక్షల భారీ మెజారిటీతో రఘువీర్ గెలిచారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఇంతకుముందు 2011లో కడప లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ 5.43 లక్షల ఆధిక్యం సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును రఘువీర్ అధిగమించారు.