మాస్చిప్ ఇన్స్టిట్యూట్ కొత్త కేంద్రం ప్రారంభం
విఎల్ఎస్ఐ, ఎంబెడ్జెడ్ సిస్టమ్స్ రంగంలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న మాస్చిప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ అత్యాధునిక కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. రాయదుర్గం నాలెడ్జ సిటీలోని అరబిందో గెలాక్సీలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో దీనిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఫిజికల్ డిజైన్, అనలాగ్ లెఔట్, డిజైన్ వెరిఫికేషన్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ విభాగాల్లో ఏటా 600 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ కేంద్రాన్ని 2011 నుంచి వేలాది మందికి శిక్షణ ఇచ్చిందని మాస్చిప్ ఎండీ, సిఈఓ వెంకట సింహాద్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెమికండక్టర్ కంపెనీల్లో తమ అభ్యర్థులు పనిచేస్తున్నారని అన్నారు.






