MLA Madhavaram: సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి: ఎమ్మెల్యే మాధవరం

బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) అన్నారు. ఎర్రగడ్డలోని షంషీర్ ఫంక్షన్ హాల్‌లో డివిజన్‌కు సంబంధించిన బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) పాలనలో సంక్షేమం, అభివృద్ధిని గుర్తు చేయాలన్నారు.ఈనెల 5 నుంచి ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.